పూరి కొత్త సినిమా ‘మెహబూబా’

1 of
Previous Next

Ad Details

  • Added: March 24, 2015

  • Views: 117

Description

పైసా వసూల్ సినిమాతో మరోసారి నిరాశపరిచిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కొత్త సినిమాను ప్రకటించాడు. ముందునుంచి అనుకుంటున్నట్టుగానే తన తనయుడు ఆకాష్ పూరిని హీరోగా రీ లాంచ్ చేస్తూ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ఈ రోజు (28-09-2017) పూరి పుట్టిన రోజు సందర్భంగా తన నెక్ట్స్ సినిమా టైటిల్ లోగోనూ రిలీజ్ చేశాడు పూరి.

ఇంటెన్స్ లవ్ స్టోరిగా తెరకెక్కనున్న ఈ సినిమాకు మెహబూబా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 1971లో ఇండియా పాకిస్థాన్ ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో సాగనుంది. సూపర్ సినిమా తరువాత మరోసారి పూరి సినిమాకు సందీప్ చౌతా సంగీతమందిస్తున్నాడు. మంగళూరు మోడల్ నేహా శెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. హిమాచల్, పంజాబ్, రాజస్థాన్ లలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది.

Tags :

Comments

Leave a Comment

Your email address will not be published. Reuired fields are marked *

Success! Thanks for your comment. We appreciate your response.
You might have left one of the fields blank, or be posting too quickly