పెళ్లి కి రెడి అంటున్న నయనతార

కల్యాణం వచ్చినా, కక్కు వచ్చినా ఆగదంటారు. అలాంటిది హీరోయిన్‌ నయనతార ప్రేమ ఇంతకు ముందు కలకలానికి దారి తీస్తే, పెళ్లి ఇప్పుడు సంచలనానికి దారి తీస్తోంది. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ. అందరికీ అందనిది ఈ మలయాళీ భామ అని నయనను అనవచ్చనుకుంటా. గతంలో హీరో శింబు ఆమెను పొందాలనుకున్నారు. అయితే అది ప్రేమతోనే ఆగిపోయింది. ఆ తరువాత డ్యాన్స్‌ మాస్టర్‌, హీరో ప్రభుదేవాతో ప్రేమలో పడ్డారు. కానీ అది పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయింది. ఈ రెండు సంఘటనలు నయన జీవితంలో మరచిపోలేని చేదు అనుభవాలేనని చెప్పక తప్పదు.

అయినా ఆమె చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో వృత్తిపై ఆ ప్రభావం పడకుండా జాగ్రత్త పడి ప్రస్తుతం అగ్రనటిగా రాణిస్తున్నారు. అయిదే ఈ అమ్మడు మూడోసారి ప్రేమలో పడి మరోసారి వార్తల్లోకెక్కారు. దర్శకుడు విఘ్నేశ్‌శివ, నయనతార డీప్‌ లవ్‌లో ఉన్నారని చాలా కాలం నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల విఘ్నేశ్‌శివన్‌ పుట్టిన రోజును పురష్కరించుకుని తనతో కలిసి నయన న్యూయార్క్‌ వెళ్లి ఎంజాయ్‌ చేశారు. ఇద్దరూ కలిసి అక్కడ తీసుకున్న ఫోటోలను వెబ్‌సైట్స్‌లో పోస్ట్‌ చేసి నెటిజన్లకు పని చెప్పారు. విఘ్నేశ్‌, నయన కలిసి ఒకే ఇంటిలో సహజీవనం చేస్తున్నారన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. అయినా వీరిలో ఏ ఒక్కరూ తమ ప్రేమ గురించి గానీ, సహజీవనం సాగిస్తున్న విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఇక తదుపరి ఘట్టం పెళ్లి. దానికి సమయం​ ఆసన్నమైందనేది తాజా సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *